Asia cup U-19: ఫైనల్ లో బంగ్లాదేశ్ పై ఇండియా ఘన విజయం 11 d ago
భారత అమ్మాయిలు అదరగొట్టారు. తొలి మహిళల అండర్-19 ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో టైటిల్ సాధించారు. ఆదివారం ఫైనల్లో 41 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఛేదనలో బంగ్లా 18.3 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష (52; 47 బంతుల్లో 5x4, 2x6) ఒంటరి పోరాటం చేసి జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించింది. స్పిన్నర్ ఆయుషీ (3/17), పర్ణిక (2/12), సోనమ్ యాదవ్ (2/13)లు విజృంభించడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. త్రిష 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచింది.